ప్రైవేటు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు

ప్రైవేటు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో గురువారం నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద గతంలో ప్రైవేట్ కళాశాల ఉపాధ్యాయులు మాత్రమే వెళ్లేవారు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వెళ్లి వారి కేటాయించిన గదులలో కూర్చోబెట్టి వస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద కూడా వారికి పరీక్ష ఎలా రాయాలి అరగంట పాటు రూల్స్ చెప్పడం బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం దానిలో భాగంగా కలవల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులను సెంటర్ వద్ద కు చేర్చి పరీక్షలు బాగా రాయండి అని ధైర్యం చెప్పి వచ్చేస్తున్నారు.

Tags: