చైతన్యపురి లో గావ్ చలో బస్తి చలో కార్యక్రమం.
On
విశ్వంభర, చైతన్యపురి ;- చైతన్యపురి డివిజన్ లో గావ్ చలో బస్తి చలో కార్యక్రమం బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రంగా నరసింహ గుప్త , జిల్లా కార్యక్రమ ఇంచార్జి శ్యామల పాల్గొన్నారు.డివిజన్ లోని వినాయక్ నగర్ బస్తి,లో బిజెపి కార్యకర్త సోదరులతో గావ్ చలో బస్తి చేలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎల్లమ్మ దేవాలయ లో పరిశుభ్రత కార్యక్రమం , బస్తీలో బస్తి వాసులతో కలిసి సహాపంక్తి భోజనం చేయడం , బీజేపీ సీనియర్ నాయకులను సన్మానించడం జరిగింది .