యూట్యూబ్ ఛానల్స్ లలో బెస్ట్ యాంకర్ గా గోపు అనిల్

యూట్యూబ్ ఛానల్స్ లలో బెస్ట్ యాంకర్ గా గోపు అనిల్

విశ్వంభర, హైద్రాబాద్ : బోడుప్పలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందినటువంటి గోపు అనిల్ కు 2025 యూట్యూబ్ ఛానల్స్ లలో బెస్ట్ యాంకర్ గా షైనింగ్ స్టార్ యాంకర్ అవార్డును అందుకున్నారు.  దిల్షుక్ నగర్ లో సోమవారం నాడు వి ఈవెంట్స్ వారు ఏర్పాటు చేసిన వేదికపై   ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్స్క్లూజివ్ కమిటీ మెంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు సెన్సార్ బోర్డ్  మెంబర్ పద్మిని నాగులపల్లి హాజరై జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గోపు అనిల్ తల్లిదండ్రులు గోపు రాములు పద్మ మాట్లాడుతూ అనిల్ గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ చానల్స్ లలో యాంకర్ గా పనిచేస్తూన్నడనీ తను చేసిన సేవలను గుర్తించిన యూట్యూబ్ ఛానల్స్ తనని సత్కరించి షైనింగ్ స్టార్ యాంకర్ అవార్డును అందించారనీ తెలిపారు.తన ప్రతిభని గుర్తించి ఈ విధంగా సత్కరించి సన్మానించడం  తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నామని, ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుతూ అనిల్ కు ఇదొక మంచి ప్రోత్సాహం అని తెలిపారు.తనని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Tags: