ఘనంగా కీ,శే ఈతకోట గోపాలకృష్ణ జయంతి

నివాళులర్పించిన అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నాయకులు

ఘనంగా కీ,శే ఈతకోట గోపాలకృష్ణ జయంతి

విశ్వంభర, బోడుప్పల్: తెలంగాణ ఉద్యమకారుడు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యుడు కీర్తిశేషులు ఈతకోట గోపాలకృష్ణ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంబేద్కర్ విగ్రహం ఎదుట జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కీర్తిశేషులు  గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల  సూర్యకిరణ్,అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు గోపాలకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈతకోట గోపాలకృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు.భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని,నత్తి మైసయ్య హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు ఈత కోట సుబ్రహ్మణ్యం కుమారి,దుర్గ భార్య కరుణ,అదిని నందీశ్వర్, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు ఎక్కిరాల లక్ష్మీ నరసయ్య మైసగళ్ళ శ్రీకాంత్,బొల్లం శశి కుమార్ సవరపు బయన్న,ఈ రమేష్, రవికుమార్,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: