జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కు వినతి
On
విశ్వంభర, ఉప్పుగూడ : గౌలిపుర డివిజన్ లోని ఉప్పుగూడ హనుమాన్ నగర్ ఫేస్ 2 లో గత 20 సంవత్సరాల నుండి వరద ముంపునకు గురవుతుందని కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సౌత్ జోన్ జి హెచ్ ఎం సి జోనల్ కమిషనర్ వెంకన్న కు హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో చైర్మన్ నరసింహ గౌడ్, అధ్యక్షులు ఆశిష్ దుబే, ప్రధాన కార్యదర్శి నరహరి గౌడ్, సలహాదారు ఏ శివచంద్రగిరి కమిటీ సభ్యులు ఠాకూర్ నర్సింగ్ సింగ్ జి, శివకుమార్, శ్యామ్, అమృత్ రాజ్, ప్రమోద్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.