సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్
ప్రశంసించి శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట రూరల్ టేకుమట్ల గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ సినియర్ నాయకులు తెలంగాణ పర్యటన అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అనుచరుడు గట్టు శ్రీనివాసు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఆయన స్వగృహంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, యువకులు, అభిమానులు ప్రశంసించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ నియమకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకి, మాజీ మంత్రి జానరెడ్డికి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డికి, పీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, షఫీ వుల్లా, ఎడ్ల వీరమల్లు యాదవ్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, ఫారుక్, ధర్మ నాయక్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



