రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం
విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆశ జ్యోతి ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110 మందిని పరీక్షించగా ముగ్గురికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలను నీరు నిలువ లేకుండా చూసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న టైర్లలో ,కూలర్లు, డ్రమ్ముల్లో నీరును పారపోయాలని ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది .ఈ కార్యక్రమంలో చిట్యాల సబ్ యూనిట్ ఆఫీసర్ అలిం , HEO జమలుద్దీన్ , HV విజయ , ,Health అసిస్టెంట్ కె.వి.కృష్ణారెడ్డి, ఏఎన్ఎం రాజేశ్వరి, రేణుక ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, శ్రావణి, మానస ,రాజమణి, అనిత గ్రామ కారోబార్ రాజిరెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.