KTR సేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం
విశ్వంభర, రాజన్న సిరిసిల్ల జిల్లా : తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామం లో KTR సేన ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. KTR సేన మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ స్వర్ణేద్రియనం నయనం ప్రధానం అని చెప్తూ 2018 ఆగస్టు 15 వ తేదీన మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం లో కేసీఆర్ కంటి వెలుగు ఏర్పాటు చేసుకుని సేవలు అందించినది మరియు 2019 ఆగస్టు 13 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రదాత మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసన సభ సభ్యులు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిరిసిల్ల లో LV PRASAD కంటి దవాఖాన కు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కంటి వెలుగుతో లక్షల కోట్లాది ప్రజలు ఎంతో లబ్ది పొందారని తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ లో అగ్నిప్రమాదం లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ నిర్లక్షం తో జరిగిన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. KTR సేన మునుముందు కూడా ప్రజల కోసమై మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో KTR సేన మండల ఉపాధ్యక్షులు 1.మామిడాల విజయ్,2. రేగుల రాజు ప్రధాన కార్యదర్శి తౌటి శివ, ఇంచార్జీ మామిడాల ఉమా శంకర్,గ్రామ శాఖ నాయకులు బాలసాని వెంకటేష్, బోనుగని మహిపాల్, బొట్క అజయ్,బాలసాని ప్రవీణ్,మణి,సీనియర్ నాయకులు అడ్డగట్ల భాస్కర్,కురుమ రాజన్న,సవనపెల్లి బాలన్న, మ్యాధరవేణి శ్రీనివాస్, యంగ్ డైనమిక్ రేగుల శ్రీనివాసులు పాల్గొన్నారు.