సూర్యపేట లో ఫ్రీ చికెన్ మేళ

* ఎగబడ్డ మాంసం ప్రియులు

సూర్యపేట  లో ఫ్రీ చికెన్ మేళ

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట తాళ్లగడ్డలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాకు జనం అధిక సంఖ్యలో పోటెత్తారు. బ్లడ్ ప్లూ వ్యాధిపై ఉన్న అపోహలు తొలగించేందుకు ఓ వెన్ కబ్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చికెన్ మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా 200 కిలోల చికెన్, 2 వేల కోడిగుడ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఉన్న  అపోహలు పోగొట్టేందుకు చికెన్, ఎగ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వెన్కాబ్ నల్గొండ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు అశోక్ కుమార్ 27,28 వార్డు మాజీ కౌన్సిలర్లు చిరువెళ్ళ లక్ష్మీకాంతమ్మ-వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలి, కాంగ్రెస్ నాయకులు చిరివెళ్ళ శబరి నాథ్, చికెన్ షాప్ నిర్వాహకులు శేఖర్ రెడ్డి, బాపురావు తదితరులు ఉన్నారు.

Tags: