మాజీ ఎంపీటీసీ కుంటయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన - మాజీ మంత్రి కేటీఆర్ 

మాజీ ఎంపీటీసీ కుంటయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన - మాజీ మంత్రి కేటీఆర్ 

విశ్వంభర, సిరిసిల్ల :  ప్రభుత్వ దవాఖాన లో మాజీ ఎంపిటిసి కుంటయ్య భౌతిక కాయానికి బి అర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుంటయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కూతుళ్ళ చదువులు, పెళ్లిలు  చెపిస్తా...ఇతర అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా  అని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుంటయ్య అంత్య క్రియలు, ఇతర  ఖర్చులు తామే భరిస్తామని , పార్టీ నేతలు అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి చూసుకుంటారని వెల్లడించారు. తన కేసు కోసం తనకు మద్దతుగా హైదరాబాద్ వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య, తానే  కానీ అఘాయిత్యానికి పాల్పడడం కలచి వేసిందని భావోద్వేగాన్ని గురయిన కేటిఆర్. కుంటయ్య కుటుంబానికి తాను పార్టీ అండగా ఉంటుందని వెల్లడి. పోలీస్ స్టేషన్  లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారిందనీ,  కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగానే కేసులు నమోదు చేస్తూ సివిల్ మ్యాటర్లో సెటిల్మెంట్ చేస్తున్నారని ఆగ్రహించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలి. కుంటయ్య మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. 

Tags: