సంతాపసభలో పాల్గొన్న డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
On
విశ్వంభర, హనుమకొండ జిల్లా : హనుమకొండ పరకాల మండలం మల్లక్కపేట శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి సంస్మరణలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన స్వేరో పలకరింపు, సంతాప సభలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా పరకాల బస్టాండ్ కూడలి నుండి ర్యాలీతో ఏకు శ్రీవాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం శ్రీవాణి మృతి ప్రభుత్వ హత్యే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.మొదటగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపసభను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ నాయకులు,నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



