వంజరి రిజర్వేషన్ల పునరుద్ధరణకు జేఏసీ ఏర్పాటు- ఎస్టీలుగా పునరుద్ధరించాలి : వంజరి సంఘాల డిమాండ్

వంజరి రిజర్వేషన్ల పునరుద్ధరణకు జేఏసీ ఏర్పాటు- ఎస్టీలుగా పునరుద్ధరించాలి : వంజరి సంఘాల డిమాండ్

హైద్రాబాద్ , విశ్వంభర :- వంజరి కులస్థుల కోల్పోయిన రిజర్వేషన్ లను పునరుద్ధించాలని ,వంజరి కుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది.
ఈ రోజు తార్నకాలో జరిగిన వంజరి రిజర్వేషన్స్ -భవిష్యత్తు కార్యాచరణ పై రాష్ట్రము లో అన్ని రిజిస్టర్ వంజరి సంఘాలతో  సమావేశం జరిగింది.

శంకరన్ కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వంజరి కులస్తులను ఎస్. టి జాబితా చేరిస్తే వ్యకిగత కక్ష్యాలతో చెన్నారెడ్డి రాత్రి కి రాత్రి ఒక చీకటి జీ. ఓ ద్వారా వంజరులను ఎస్. టి జాబితానుండి బీసీ (డీ )జాబితా లోచేర్చి వంజరుల పట్ల మరణశాసనం లిఖించారని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది.

Read More రోగులను పట్టి పీడిస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు 

చెన్నారెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీ. ఓ ను రద్దు చేసి వంజర్లను ఎస్టీలలో పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్ చేసింది.
 వంజరులను ఎస్టిలో చేర్చాలన్న డిమాండ్ కొత్తది ఏమి కాదని  నిజమైన సంచార జాతి అయిన వంజర్లను ఎస్టీలుగా  గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 రిజర్వేషన్ల సాధనకు అన్ని రిజిస్టర్ సంఘాల ప్రతినిధులతో ఐక్య కార్యాచరణ సమితి(JAC) ని ఏర్పాటు చేశారు 
 వంజరి రిజర్వేషన్లు సాధనకు ఏకకాలంలో బహుముఖ వ్యూహం, దీర్ఘకాలిక లక్ష్యం స్వల్పకాలిక వ్యూహాలు అన్న విధానంతో ముందుకెళ్లాలని సమావేశం తీర్మానించారు వంజరి కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  విశ్రాంతఐఆర్ఎస్ అధికారి తెలంగాణ వంజరి సంఘం మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి వంజరి రిజర్వేషన్ కమిటీ ప్రతినిధులు ముజకరి రవీందర్,పోతనకార్ లక్ష్మీనారాయణ మహాదేవ్ ముండే కాలేరు రూపసురేష్,
 తెలంగాణ వంజరి సేవా సంఘం ప్రతినిధులు దాత్రిక ధర్మరాజు  ఎదుగాని హరినాథ్ పిట్టల అంజయ్య తెలంగాణ బంజరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాత్రికా కాశీనాథ్ కాలేరు యుగంధర్,అనంతుల అనిల్ కాలేరు శ్రీనివాస్ విటల్ శ్రీనివాసరావు  నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం ప్రతినిధులు బోనకర్ భూమయ్య కరిపే సత్యం మాస్టర్ శంకర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు  కరిపే రవీందర్ రత్నంకోటాజీ,జగిత్యాల పట్టణం నుండి కృష్ణ నగర్, గంజ్ వంజరి సంఘాల అధ్యక్షులు పోతునుక మహేష్,నవాతు ఆంజనేయులు సంఘం కార్యదర్శులు లవంగ శ్రీనివాస్, నవాతు రాజేందర్, బానుక బుచ్చిలింగం,ఆముద లింగారెడ్డి 
 ఉద్యోగ ఉపాధ్యాయులు  అడ్వకేట్లు జర్నలిస్టులు వివిధ రిజిస్టర్ సంఘాల ప్రతినిధులుఅధిక సంఖ్యలో  పాల్గొన్నారు

Tags: