రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం  -నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి

రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం    -నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి

విశ్వంభర, పెద్ద శంకరంపేట : తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్  సంజీవరెడ్డి అన్నారు. నిజాంపేట్ మండల కేంద్రంలో  మునిగేపల్లి గ్రామంలో సోమవారం డీసీఎంఎస నారాయణఖేడ్ సొసైటీ ద్వారా వరి ధాన్యం , జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇష్టానుసారంగా తరుగు పేరు మీద 6 నుంచి 7 కిలోల తరుగు తీసేవారని రైతులకు ఎంతో నష్టం చేసేవారని కానీ మా ప్రభుత్వం  నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కటిన్నర కిలోల కన్నా ఎక్కువ తరుగు తీయొద్దని అధికారులకు చెప్పడం జరిగింది అని ఎమ్మెల్యే  అన్నారు దీనివలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు చేసిన రెండు నుంచి మూడు రోజులలోపే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని  సన్న వడ్లు పండించే రైతులకు అదనంగా 500 బోనస్ ను మా ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు శంకర్ గౌడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాధా కిషన్ సెట్ లింగారెడ్డి మాజీ ఎంపీటీసీ పండుగ కిష్టయ్య శంకర్ అశోక్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ వినోద్ పాటిల్ రమేష్ చౌహాన్, జింకల వెంకటేష్, మిస్కిన్ పాటిల్,మరియు అధికారులు నిజాంపేట్& మునిగేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు. 

Tags: