పడి లేస్తున్న పసిడి ధరలు

పడి లేస్తున్న పసిడి ధరలు

విశ్వంభర, హైదరాబాద్ : దేశంలో పసిడి ధరలు మళ్లీ పంజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ధరలు తగ్గుతాయని భావించిన వారికి మాత్రం నిరాశ ఎదురైంది. అయితే అసలు ఈ ధరలు ఎందుకు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు విధించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని అనేక దేశాలు వ్యతిరేకించాయి. దీంతో అమెరికా, భారత్ సహా అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇదే సమయంలో పసిడి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఆ క్రమంలో డాలర్ విలువ బలపడుతుందని, గోల్డ్ ధరలు దాదాపు 50 వేల స్థాయికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అన్నారు. కానీ తాజాగా మాత్రం బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పసిడి రేట్లు తగ్గుతాయని భావించిన సామాన్యులకు షాక్ తగిలింది. అయితే అసలు పసిడి రేట్లు ఎందుకు పెరుగుతాయి. ఎందుకు తగ్గుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
 
సురక్షితమైన పెట్టుబడిగా
 
ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు, ప్రభుత్వాల అప్పులు, వడ్డీ రేట్లు, పెరిగిన ఖర్చుల వంటి పరిస్థితుల్లో గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రపంచంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోవడంతో గోల్డ్ ధరలు అత్యధికంగా పెరిగాయి. ఇది గోల్డ్‌ను భద్రతగా భావించే పెట్టుబడిదారుల ఆశయాన్ని మరింత పెంచింది. అనిశ్చితి సమయంలో గోల్డ్ సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
 
వడ్డీ రేట్లు కూడా
 
గోల్డ్ ధరలు, వడ్డీ రేట్లపై ఆధారపడి కూడా మారుతుంటాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే, గోల్డ్ ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లలో పెరుగుదల జరిగితే, పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడులపై దృష్టి పెట్టి, గోల్డ్‌పై పెట్టుబడులు తగ్గించాలని కోరుకుంటారు. ఆ క్రమంలో వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు, గోల్డ్‌కి డిమాండ్ పెరుగుతుంది.
 
సాంప్రదాయ ఉత్సవాలు
 
బంగారంను ఎక్కువగా ఆదరించే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ క్రమంలో అనేక మంది పసిడిని ఒక్కసారిగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినా కూడా గోల్డ్ ధరలు పెరుగుతాయి. ప్రధానంగా వివాహాలు, పండుగలు, సాంప్రదాయ ఉత్సవాల వంటి సమయాలు కూడా గోల్డ్ కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయి. ప్రపంచంలో చోటుచేసుకునే రాజకీయ సంఘటనలు కూడా గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తాయి. దేశాల మధ్య యుద్ధాలు, విదేశీ సంబంధాల ఉద్రిక్తత సహా పలు అంశాలు గోల్డ్ ధరల మార్పులకు కారణమవుతాయి.
 
చెల్లింపుల మార్పులు
 
భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులు కూడా గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ విపత్తులు పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. దీంతోపాటు గోల్డ్ ధరలు ప్రపంచ డాలర్‌తో అనుసంధానంగా మారుతుంటాయి. డాలర్ విలువ పెరిగితే, గోల్డ్ ధరలు తగ్గే అవకాశముంది. డాలర్ విలువ తగ్గితే, పసిడి ధరలు పెరుగుతాయి. డాలర్ జారీ చేస్తున్న దేశాల ప్యాకేజీలతో సంబంధాలు, జాతీయ చెల్లింపుల మార్పులు, ఇతర కారకాలు కూడా గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తాయి.
 
డా. డి. చెన్నప్ప
సీనియర్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ.

Tags: