మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!
హైకోర్టులో మల్లారెడ్డికి చెక్కెదురైంది. జీడిమెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన కల్పించాలని మల్లారెడ్డి తరఫున న్యాయవాది పిటిషన్‌ను సమర్పించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ వివాదంలో ఉపశమన ఆదేశాలకు నిరాకరించింది.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా హైకోర్టులో మల్లారెడ్డికి చెక్కెదురైంది. జీడిమెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన కల్పించాలని మల్లారెడ్డి తరఫున న్యాయవాది పిటిషన్‌ను సమర్పించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ వివాదంలో ఉపశమన ఆదేశాలకు నిరాకరించింది.
జీడిమెట్లలోని సర్వే నంబర్ 82, 83లోని స్థల వివాదంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమ అధీనంలో ఉన్న భూమిలో జోక్యం చేసుకోకుండా పోలీసులకు, తహసీల్దార్‌కు ఆదేశాలు ఇవ్వాలని మల్లారెడ్డి, ఆయన కుటుంబం కలిసి కోర్టులో పిటిషన్ వేశారు.
సివిల్ కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివాదాస్పద భూమికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు సైతం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.