అమ్మదయతో అందరూ బాగుండాలి. -  గవర్నర్

అమ్మదయతో అందరూ బాగుండాలి. -  గవర్నర్

విశ్వంభర, న్యూఢిల్లీ ; తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ అని,అమ్మ కరుణా కటాక్షాలతో అందరూ సుఖ సంతోషాలతో  ఉండాలని, సరైన వర్షాలు కురిసి వ్యవసాయం రంగం ద్వారా రైతులకు సిరులు కురిపించే పంటలు పండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆషాఢ బోనాల్లో  భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బోనాల  పండుగకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  భక్తి శ్రద్ధలతో అమ్మకు నైవేద్యంగా బోనం సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చాలని కోరుకుంటూ అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ప్రతిబించేలా  బోనాలతో, పోతరాజుల విన్యాసాలు, డప్పు, దరువులకు నాట్యాలు  పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చి బోనాల ఉత్సవాలను గురించి  ఈ కార్యక్రమంలో గోల్కొండ బోనాల కమిటీ చైర్మన్ లాల్ దర్వాజా నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే వెంకట్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రటరీ కొదుమూరి దయాకర్ రావు, భార్గవ్, యర్రమాధ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: