ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

విశ్వంభర, కడ్తాల్: నేటి సమాజంలో మనిషి ప్రశాంతంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని హనుమస్పల్లి 
హనుమాన్ దేవాలయంలో ప్రతి రెండో శనివారం సత్యనారాయణ రథోత్సవం జరుగుతుంది. రెండో శనివారం అశోక బిల్డర్స్ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సత్యనారాయణ వ్రతము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జైపాల్ యాదవ్, దశరథ్ నాయక్ తోపాటు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు  నిర్వహించిన అశోక బిల్డర్స్ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి, డైరెక్టర్ సేవ్య నాయక్, గిరిజన నాయకుడు హన్మ నాయక్, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక  అధ్యక్షులు రాఘవేందర్ నాయకులు శంకర్ సక్రు మోహన్, శ్రీను, జే డి ఎన్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్, పవన్, శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: