వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎన్.రాంచందర్‌రావు

వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను ఆవిష్కరించిన ఎన్.రాంచందర్‌రావు

విశ్వంభర, హైదరాబాద్ :ఆగస్టు 3న హైదరాబాద్ లో  జరిగే వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యులు తమ  జనాభా దామాషా ప్రకారం రాజకీయ  వాటా కావాలని కోరడం   న్యాయమైన డిమాండ్ అని  అన్నారు. వైశ్యులకు భారతీయ జనతా పార్టీ తగిన  ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త, బిజెపి సీనియర్ నాయకులు గందె సుధాకర్ గుప్త, కాచం  కృష్ణమూర్తి గుప్త, మణిదీప్ ఛారిటబుల్ ట్రస్ట్  చైర్మన్  మణిదీప్ గుప్త, నంగునూరి రమేష్,కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి,  ప్రవీణ్,  తదితరులు పాల్గొన్నారు

Tags: