ఇస్రో చైర్మన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న డా. పస్పుల్లా అనిత

ఇస్రో చైర్మన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న డా. పస్పుల్లా అనిత

విశ్వంభర, హైదరాబాద్:  ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పస్పుల్లా అనిత ఫిజికల్ ఎడ్యుకేషన్ లో పి. హెచ్ డి పూర్తి చేసిన సందర్బంగా ఇస్రో చైర్మన్ డా. వి నారాయణ్ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా ఉన్నతమైన చదువుకు సహకరించి నిరంతరం గైడ్ చేసిన మా గురువు  ఇంచార్జి డైరెక్టర్, డిపిఈ, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కు  ధన్యవాదాలు తెలియజేసారు. క్రీడ విభాగంలో చాలా సవాళ్ళను ఎదురుకోవాలి. క్రీడా విభాగం శారీరక బలాన్ని మాత్రమే కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడ పెంపొందించే సవాలుతో కూడిన రంగం అని ఆమె చెప్పారు.  సాధించాలనే తపన ప్రతిఒక్కరిలో ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని అన్నారు. తన ఎడ్యుకేషన్ కు సహకరించిన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈమె గురుకుల MJPTBCWRDC లో పని చేస్తున్నారు. మంగళవారం మొత్తం 121 బంగారు పతకాలను ఓయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, ఓయూ ఉపకులపతి మొలుగరం ఆచార్య కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆయా విభాగాల్లో పీహెచ్ఎ పూర్తి చేసిన 1,261 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు

Tags: