ఎమ్మెల్సీ కమలనాధుల విజయోత్సవ సంబరాలు
విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఫిబ్రవరి 27న జరిగిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులైన చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కా కొమురయ్య, విజయ దుందుబి మోగించిన సందర్బంగా మహాదేవపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో బాణాసంచా పేల్చి, స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది. బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ తెలంగాణాలో ప్రతిష్టత్మాకంగా జరిగిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కమలనాధుల విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, నిరంతరo శ్రమించిన బీజేపీ నాయకులకు, పచ్చిస్ ప్రభారీలకు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలియజేసారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు నోట్ల కట్టాలవైపు కాకుండా, దేశం కోసం, దర్మం కోసం పనిచేసే బీజేపీ వైపే వున్నారని, తెలంగాణాలో రానున్న స్థానిక ఎలక్షన్ లో కూడా బీజేపీ అధిక మొత్తంలో స్థానాలను కైవసం చేసుకొని విజయ కేతానం ఎగురావేస్తుందని మాట్లాడడం జరిగింది.



