డాక్టర్ ధర్మపురి సంపత్ రాజారం యాదవ్ 13వ వర్ధంతి
బిసి సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం
విశ్వంభర, హనుమకొండ జిల్లా : బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ అధ్యక్షతన గండు అశోక్ పర్యవేక్షణలో బీసీ ప్రతినిధులు మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ మహానుభావుడైన డాక్టర్ ధర్మపురి సంపత్ రాజారం యాదవ్ ని స్మరించుకుంటూ, ఆయన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటున్నాను. ఆయన జీవితాంతం బీసీల హక్కుల కోసం పోరాడిన మహా సమాజ సేవకుడు. బలహీన వర్గాల అభ్యున్నతే తన కర్తవ్యం అని నమ్మి, ఎల్లప్పుడూ ఉద్యమ పంథాలో ముందుండి నడిచిన సాహసవంతుడు. డాక్టర్ సంపత్ రాజారం యాదవ్ వరంగల్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి, సహాయం కావలసిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచారు. అలాగే ఆయన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా మొత్తం తెలంగాణలో యువతలో సేవాస్ఫూర్తి, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడానికి విశేష కృషి చేశారు. ఆయన ఆత్మసమర్పణ, త్యాగం, సేవా స్పూర్తి తరతరాలకు ఆదర్శప్రాయముగా నిలుస్తుంది. సమాజం కోసం చేసిన ఆయన యత్నాలు ఎప్పటికీ మరచిపోలేనివి. ఈ 13వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు నా వినమ్ర నివాళులు అర్పిస్తూ, ఆయన చూపిన దారిలో ముందుకు సాగేందుకు నిశ్చయంతో ఉన్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను అనిల్ డాక్టర్ విజయలక్ష్మి ఎసిపి రవీందర్ కుమార్ గారు గడ్డం భాస్కర్ డాక్టర్ కూరపాటి రమేష్ నేత వరంగల్ యాదవ సంఘం అధ్యక్షులు గిరబోయిన రాజయ్య యాదవ్ జనగామ జిల్లా అధ్యక్షులు బనక సంపత్ యాదవ్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ కావటి కవిత కంకణాల మల్లేశం సార్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు కార్పొరేటర్ బొంగు అశోక్ ఎల్లావుల కుమార్ యాదవ్ బ్లడ్ డోనర్స్ బుట్టి శ్యామ్ యాదవ్ బగ్గీ రాజుముదిరాజ్ బొల్లం వెంకటేశ్వర్లు గాలి సుధాకర్ ఇతర 20 బ్లడ్ డోనర్స్ పాల్గొన్నారు అనంతరం నయీమ్ నగర్ లో బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు.



