బస్సులు దిగబడుతున్న పట్టించుకోరా
On
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 20 : - తలకొండపల్లి మండలం గడ్డమీద తండా గ్రామపంచాయతీకి రోడ్డు సౌకర్యం సరిగ్గాలేని మూలంగా బడి పిల్లలు ప్రయాణించేటువంటి స్కూలు బస్సు శనివారం ఉదయం రోడ్డుపై దిగబడింది. గడ్డమీద తండా రోడ్డు వానలకు అస్తవ్యస్తంగా తయారవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు రోడ్డుపై ప్రయాణిస్తుండగా జారిపడి అనేకమందికి కాళ్లు చేతులు విరగగొట్టుకున్నారని. గ్రామపంచాయతీ గా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న నేటికీ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యము లేదని ఇప్పటికైనా వెంకట్రావుపేట్ నుండి గడ్డమీద తండా గ్రామపంచాయతీకి బిటి రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.