సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు: సీపీ సాయిచైతన్య
విశ్వంభర,నిజామాబాద్: సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని, ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మతాల పెద్దలతో సీపీ ఆఫీస్లో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉగాది, హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా శాంతి కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అన్నారు. అన్ని మతాల వారు సోదరభావంతో ఉండాలని సూచించారు. రంజాన్ మాసంలో మసీదుల వద్ద ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) జి.బస్వారెడ్డి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.



