పద్మశాలీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. లక్ష విరాళం

ప్రకటించిన డాక్టర్ కోడి శ్రీనివాసులు

పద్మశాలీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. లక్ష విరాళం

విశ్వంభర, చండూర్ : పట్టణ కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ నిర్మాణానికి గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ , గాంధీజీ విద్యాసంస్థల అధినేత , ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా. కోడి శ్రీనివాసులు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో కమ్యూనిటీ భవన నిర్మాణం కొరకు విరాళం అందజేయడం జరిగింది. కుల పరంగానే కాకుండా పట్టణంలో ఎవరికీ ఏ ఆపద వచ్చిన వారికి గాంధీజీ ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట  పట్టణ పద్మశాలి సంఘం నాయకులూ , చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: