జేఎన్టీయూ విద్యార్థి శైలజకు డాక్టరేట్.

జేఎన్టీయూ విద్యార్థి శైలజకు డాక్టరేట్.

విశ్వంభర, ఎల్బీనగర్ : జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్  ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న శైలజ డాక్టరేట్ సంపాదించారు. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన శైలజ డాక్టరేట్ పట్టాను గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. శైలజ తన తల్లిదండ్రులు పోకల రాము రాజేశం, వరలక్ష్మితో కలిసి చైతన్యపురిలో నివాసం ఉంటున్నది. తమ కూతురు డాక్టరేట్ సంపాదించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని తల్లిదండ్రులు తెలిపారు. పట్టుదలతో చదువుతే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

Tags: