పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విశ్వంభర, రామన్నపేట:  ఇస్కిల్ల గ్రామంలోని  గుండ్ల సత్తయ్య మెమోరియల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సందర్శించారు.  అక్కడ తరగతి గదులను, మరుగు దొడ్లను, బాత్రూమ్స్ అంగన్వాడి తరగతి గదులను పరిశీలించి, అందులోని వసతులను పరిశీలించారు. పర్యటణ ముఖ్య ఉద్దేశం ఏడవ తరగతి వరకు ఉన్న స్కూలు ఎనిమిదవ తరగతి వరకు అనుమతించుటకు తరగతి గదులను పరిశీలించారు. త్వరలో 8వ తరగతికి అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఊరిలో ఉన్న సమస్యలు డ్రైనేజీ, రోడ్డు సదుపాయాలు, ఊరిలో ఉన్న అనేక సమస్యలను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్ పి ఓ, తహసిల్దార్, ఎంపీడీవో, ఆర్ఐ, కార్యదర్శి వల్లమల్ల నరేందర్, కన్నెబోయిన చిన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: