ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు షూస్,టై,బెల్ట్, ఐడి కార్డుల పంపిణీ 

ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు షూస్,టై,బెల్ట్, ఐడి కార్డుల పంపిణీ 

ప్రజా విశ్వంభర, కొండాపురం : - గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో షూస్,టై,బెల్ట్, ఐడి కార్డులను గిరి కరుణాకర్  విద్యార్థులకు అందజేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు షూస్, టై, బెల్ట్, ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి సుధాకర్ రెడ్డి.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూతం ముత్యాలు, ముకేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కరుణాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి,విద్యార్థులలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం తన వంతు కృషి చేస్తానని ఎల్లవేళల తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. 

Tags: