13వ డివిజన్ లో అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
On
విశ్వంభర, బోడుప్పల్ : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మంగళవారం త్రిబుల్ ఎస్ గార్డెన్ లో కార్పొరేషన్ పరిధిలో 60 గజాల ఇంటి స్థలం గల పట్టాదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికై అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కమిషనర్ శైలజ, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్లతో కలిసి లబ్ధిదారులకు పత్రాలను అందజేసిన సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా దానగల్ల యాదగిరి మాట్లాడుతూ 13వ డివిజన్లో అర్హులైన ఆరుగురికి ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్ హయాంలో పేద ప్రజల ఇంటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు,13వ డివిజన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.