అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ.

 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ.

విశ్వంభర,నల్గొండ;- నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్నీ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా కొమ్ము శ్రీను మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి  సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలే అంబేద్కర్ కోరుకున్న సమానత్వం, సామాజిక న్యాయ సాధనలో ఈరోజు మరో కీలక ముందడుగు పడిందన్నారు. ఆ మహనీయుని జయంతి నాడే, దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కల సంపూర్ణంగా నెరవేరుతుండడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మహనీయుని జయంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పంపిణీ చేయడం వలన పేదలకు కొంత తోడ్పాటు అందించినట్లవుతునది ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో దైద కాశయ్య,గూడపురి శ్రీను,చిమట నాగయ్య యాదవ్,ఆర్కే,శ్రావణ్,శోభన్,కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: