గ్రామ సభలో డిప్యూటీ కలెక్టర్

గ్రామ సభలో డిప్యూటీ కలెక్టర్

విశ్వంభర, భూపాలపల్లి: ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, భూ సేకరణ అధికారి మయాంక్ సింగ్, కాటారం తహసీల్దార్ నాగరాజు, సంబంధిత అధికారుల బృందం జాదరావుపేట గ్రామపంచాయతీ (రఘుపల్లె గ్రామం) లో గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా వీరాపూర్ చెరువు విస్తరణ కోసం ప్రతిపాదిత 0-11 గుంటల భూమి సేకరణపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక నోటిఫికేషన్ చదివి వినిపించడంతో పాటు, ప్రాజెక్ట్ ద్వారా ప్రభావిత రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. సంబంధిత అధికారులకు రైతుల అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కార చర్యలు తీసుకునే విధంగా సూచనలు అందించారు.

Tags: