అభివృద్ధి పనులను పరిశీలించిన  కార్పొరేటర్ 

అభివృద్ధి పనులను పరిశీలించిన  కార్పొరేటర్ 

విశ్వంభర, కొత్తపేట్ :- డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్  నాయకోటి పవన్‌కుమార్ పరిశీలించారు. సుమారు రూ.85 లక్షల వ్యయంతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు.  కాలనీలోని స్ట్రామ్ వాటర్,పార్క్ కాంపౌండ్ వాల్ మరియు సీసీ రోడ్డు వంటి అంశాలను సమీక్షించి, పనులు నాణ్యతతో, కాలనీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, భారీ వర్షం పడినా కూడా చుక్క నీరు నిలవకుండా చూడాలని, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు జిహెచ్ఎంసి ఏఈ షరీఫ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు లకు  కార్పొరేటర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు యాదయ్య, కాలనీ సభ్యులు , బిజెపి నాయకులు నాయకోటి ప్రదీప్ కుమార్ , సాయి పాటిల్ , శరణ్  తదితరులు పాల్గొన్నారు.

Tags: