పేదింటి కల ఇందిరమ్మ ఇంటితో సహకారం - ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్
విశ్వంభర, మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజలు చేసి శంకుస్థాపన చేసిన మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ కమిషనర్ శైలజ,మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పోగుల నరసింహారెడ్డి, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి హాజరై భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల యాదగిరి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటి కల పూర్తయిందని, ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలను విడతలవారీగా మంజూరు చేస్తూ పేదవాళ్ల ఇంటి నిర్మాణానికై ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.