స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి
విశ్వంభర, జనగామ : పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆద్వర్యంలో దేవరుప్పుల మండలం, ధర్మపురం,మాధాపురం గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల నాయకత్వాన్ని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య సజ్జన్, బోనగిరి యాకస్వామి, దావెర అనిల్ కుమార్, దౌపాటి రవి, భూక్యా భాస్కర్, భూక్యా మహేందర్ , గుగులోతు నరేందర్ , దౌపాటి నరసింహ, ధర్మపురం గ్రామ పార్టీ అధ్యక్షులు సంఘీ కుమార్, మాదాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస చారి, కొంగరి ఉమేష్, గనుపాక ప్రదీప్, కొంగర గిరిబాబు, చిలుకాని కొమరయ్య, పంజాల శ్రీధర్, చిలుకాని అనిల్ తదితరులు పాల్గొన్నారు