ఐఏఎస్ అధికారి పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. 

ఐఏఎస్ అధికారి పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. 

విశ్వంభర,  చంద్రాయణ గుట్ట: గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులతో పాఠశాల గదులు, శోచాలయాలు శుభ్రం చేయించాలని ఆదేశించిన ఐఏఎస్ అధికారిని వర్షినిపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ డిమాండ్ చేశారు. సమైక్య ప్రతినిధులు శివకుమార్ , కృష్ణ గౌడ్, నరేందర్, కృష్ణ, సుశీల్ కుమార్ తదితరులతో కలిసి ఛత్రినాక ఇన్ స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురుకులాల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల పిల్లలతో మూత్రశాలలు శుభ్రం చేయించాలని ఆదేశించడం బాధ్యత రహితమని పేర్కొన్నారు. విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags: