ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని  కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రినీ ఆకస్మికంగా తనిఖీ చేసి, డిఈఐసి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆర్బీఎస్కె ఆధ్వర్యంలో నడిచే (డిఈఐసి)ని తక్షణమే సేవలను ప్రారంభించాలని పిల్లలకు కావాల్సిన ఫిజియోథెరపీ, డెంటల్, తదితర సౌకర్యాలను కల్పించాలని సంబంధిత వైద్య అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తొర్రూరు లో డయాలసిస్ సెంటర్ మిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో ఆయన వెంట జిల్లా ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, డాక్టర్ హర్షవర్ధన్, సంబంధిత సిబ్బంది ఉన్నారు.

Tags:  

Advertisement