చేనేత కార్మికుల జియో ట్యాగ్ పేరిట లక్షల్లో వసూళ్లు..!?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వసూళ్ల దందా - డబ్బులు ఇచ్చిన పని కాకపోవడంతో  తిరగబడుతాం అంటున్న భాదితులు

చేనేత కార్మికుల జియో ట్యాగ్ పేరిట లక్షల్లో వసూళ్లు..!?

విశ్వంభర , తెలంగాణ :-  డెస్క్ :-- చేనేత కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరవాత తెలంగాణ ప్రభుత్వాలు చేనేత కార్మికులకు వివిధ రకాల సంక్షేమ పధకాలను రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గా మొదటిసారి అధికారంలోకి వచ్చినా రెండు పర్యాయాలలో చేనేత కార్మికుల ఆత్మహత్యల  నివారణకు పలు కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న భరోసా , చేనేత థ్రిఫ్టు ఫండ్ పథకాలతో పాటు బతుకమ్మ చీరలు ను చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం,  అలాగే నాడు, నేడు చేనేత కార్మికులకు ఎదో ఒక విధంగా చేనేత  కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంది.. కానీ నాడు గత ప్రభుత్వంలో చేపట్టిన చేనేత థ్రిఫ్టు ఫండ్ ద్వారా జియో ట్యాగ్స్ నెంబర్లు ను మగ్గాలకు కేటాయించి వారి బ్యాంకు ఖాతాల్లో వారు కట్టే కొంత నగదుకు రెండు  రెట్టింపు ల నగదు ను ప్రభుత్వం జమ చేస్తుంది. ఆనాటి  ప్రభుత్వంలో చేనేత  కార్మికుల జనాభాను దృష్టిలో పెట్టుకొని వారి జీవనోపాధికి మార్గం లా థ్రిఫ్టు ఫండ్ ద్వారా కొంత మేర లబ్ది చేకూరింది . కానీ రెండు సార్లు అధికారం చేపట్టిన తరవాత మూడవ సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం అలాగే గత ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన థ్రిఫ్టు ఫండ్ స్కీం ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది.. మరల చేనేత కార్మికుల మగ్గాల పై ఉన్న జియో ట్యాగ్స్ లబ్ద్ధిదారుల విచారణ తో నేడు అధికారులు చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఎంక్వయిరీ లతో అర్హులైన చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ ద్వారా అధికారులు చేనేత కార్మికులు ఉన్న  గ్రామాల్లో ఒకటికి  పది సార్లు విచారణ ల పేరిట జియో ట్యాగ్స్ కేటాయించడంలో పలు సమస్యలతో కూడిన షరతులు విధిస్తు అయోమయానికి గురి చేస్తున్నారని చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. 
 
నేటి ప్రభుత్వంలో చేనేత జౌళి శాఖ అధికారులు , ఏడి లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...  
జియో ట్యాగ్ పేరిట లక్షల్లో దందాలు ..!?
చేనేత కార్మికుల అవస్థలు పడుతున్నారు. 
జియో ట్యాగ్ కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. 
జియో ట్యాగ్ కేటాయించాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే.. !
చేనేత జౌళి శాఖ అధికారులతో దళారులు కుమ్మక్కయ్యారు. 
చేనేత కార్మికుల తో బేరసారాలు దళారులు చేస్తున్నారు. 
మధ్యవర్తిత్వం ద్వారా చేనేత కార్మికుల దగ్గర డబ్బులు వసూల్ చేయిస్తున్న ... ఆ జిల్లా అధికారి ..! ?
మగ్గానికో రేట్ ..? ... కార్మికుడికో రేట్ ..? వసూలు చేస్తున్నారు. 
చేనేత తో సంబంధం లేని వ్యక్తులకు పెద్ద ఎత్తున జియో ట్యాగ్స్ నెంబర్లు కేటాయిస్తున్నారు. 
అడ్డగోలుగా ఆంక్షలు పెట్టి అసలైన కార్మికుడికి అన్యాయం చేస్తున్నారు. 
ట్రాన్స్ఫర్ జియో ట్యాగ్స్ పై కూడా వేల రూపాయలు దండుకుంటున్నారు. 
డబ్బులు తీసుకొని 6 నెలలు అవుతున్న కూడా జియో ట్యాగ్ అకౌంట్ లో జమ అవ్వడం లేదని ఆరోపణలున్నాయి. 
ఇదే అదనుగా మరికొంతమంది వ్యక్తులు వృత్తిపై ఆధారపడని  వారి నుండి వేలల్లో డబ్బులు వసూలుచేస్తున్నారు. డబ్బులు ఎందుకు అని కార్మికులు అడిగితే.. అధికారులకు ఇవ్వాలని బుకాయిస్తున్నారు అని కార్మికులు పేర్కొన్నారు.
 ఫోన్ పే , గూగుల్ పే ల ద్వారా పెద్ద ఎత్తున అమౌంట్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి.
 జియో ట్యాగ్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.. అంటూ ఆ జిల్లా అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
దళారులను పెట్టి వ్యాపారం చేస్తున్న ఆ జిల్లా అధికారి ఎవరు ..?
చేనేత జౌళి శాఖ అధికారులు అక్రమాలు - ఆగడాలకు అంతులేదు..!
 జియో ట్యాగ్ కు ఎందుకు డబ్బులు ఇవ్వాలి .. ?
డబ్బులు ఇచ్చిన పని కాకపోవడంతో భాదితులు తిరగబడుతాం అంటున్నారు.
చేనేత కార్మికుల రుణమాఫీ చేయిస్తామంటూ దళారుల దందా ..!
చేనేత కార్మికులు ఇలా పలు ఆరోపణలు చేస్తున్నారు.. !
 
(మరింత పూర్తి సమాచారంతో మరో కధనం (విత్రీ న్యూస్ ఛానల్ -  విశ్వంభర దినపత్రిక )

 

Tags: