చతుర్ముఖమా, త్రిముఖమా, ద్విముఖమా..! స్థానిక ఎన్నికల హోరు - పల్లెల్లో జోరు
విశ్వంభర, చండూర్ : స్థానిక ఎన్నికల జోరు పల్లెల్లో జోరుగా సాగుతుంది. ఆశావహులు ఎవరు బయటపడకున్నా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా మొదలుపెట్టారు. స్థానిక సంస్థలు ఎన్నికల నగారా ఎప్పుడు మొదలవుతుందోనని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. చండూరు మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా జరిగిన కొన్ని రాజకీయ చర్యల వల్ల చాలా పెను మార్పులే జరుగనున్నాయి. స్థానిక నాయకులు మండల స్థాయి పదవి కోసం గ్రామాలలో నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. మండలంలో జడ్పిటిసి ఎన్నికలకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడుతూన్నారు. అన్ని ప్రధాన పార్టీలలో ఈ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఎన్నికలకు రిజర్వేషన్ బీసీ జనరల్ కాగా ఈ ఎన్నికలకు కూడా బిసి జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ నుండి ఓసి రిజర్వ్ అయితే నెర్మట నుండి ముఖ్యమంత్రి బంధువు ఒకరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. సిర్దేపల్లి మాజీ సర్పంచ్ మారెడ్డి నర్సిరెడ్డి, పాల్వాయి వారసుడు శ్రవణ్ కుమార్ రెడ్డి బిసి రిజర్వ్ అయితే కావలి ఆంజనేయులు, గంట సత్యనారాయణ ,అబ్బనబోయిన లింగయ్య,సాపిడి రాములు , సిజావుద్దీన్, ఇంకా అరడజను మంది టికెట్ ఆశిస్తున్నారు. ప్రతిపక్ష బీఆరెఎస్ ఉంది ఓసి రిజర్వ్ అయితే యత్తపు మధుసూదనరావు, అనిల్ రావు, బిసి రిజర్వ్ అయితే బోయపల్లి రమేష్, బొమ్మరబోయిన వెంకన్న, నల్ల లింగయ్య, సీపీఐ నుండి బోయపల్లి శ్రవణ్ కుమార్, నల్పరాజు రామలింగయ్య, నల్పరాజు సతీష్, బిజెపి నుండి ఓసి అయితే బొబ్బలి వెంకట్రామిరెడ్డి, కాసాల జనార్ధనరెడ్డి, బిసి రిజర్వ్ అయితే నకిరేకంటి లింగస్వామి బరిలో ఉంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. కాంగ్రెస్,సీపీఐ పొత్తులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో 2 జడ్పీటీసీ స్థానాలు,1 ఎంపీపీ స్థానాలు ఇస్తారన్న ఉహాగానాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం కాంగ్రెస్ నుండి గంట సత్యనారాయణ కు కోమటిరెడ్డి ఆశీస్సులు ఉండగా ఇటీవల చండూర్ మున్సిపాలిటీ పార్టీ కో ఆర్డినేటర్ గా నియమించారు. ఒకవేళ పొత్తులో భాగంగా జడ్పీటిసి అవకాశం రాకపోయినా ఎంపీపీ ని చేసే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ నుండి బోయపల్లి రమేష్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్,బిజెపి పొత్తు కుదిరితే చాలా సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎవరికీ టికెట్ వస్తుందో ఊహించలేని పరిస్థితి. పార్టీ మారి వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారా అనే కోణం లో కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో వైపు అంగబలం , ధనబలం నాయకుడి ఆశీస్సులు ఉన్నవాళ్ళకి అవకాశం కల్పించిన ఆశర్యపోనక్కర్లేదు.. సొంత పార్టీ కోసం నిత్యం జెండా మోసిన వారికే వచ్చే అవకాశాలు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కూడా సమాచారం. స్థానిక నేతలు , నాయకులూ, కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్టు వినికిడి.. మరి చివరికి ఏమి జరుగుతుందో .. ఎవరికీ వరిస్తుందో తెలియదు కానీ చండూర్ మండల రాజకీయం మాత్రం రసవత్తరంగా సాగనుంది.



