చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
On
విశ్వంభర, హరి బౌలి : ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా సప్తమాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో మంగళవారం హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయంలోని అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం జోగిని అవికా దేవి ఊరేగింపుగా వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరవ బంగారు బోన సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రతినిధులు శ్రీకాంత్ శ్రీధర్ వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు డి ప్రభాకర్ మధుసూదన్ యాదవ్ హన్సరాజు, ఆదర్ల మహేష్, దత్తాత్రేయ, రాందేవ్ అగర్వాల్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.



