రేషన్ కార్డుల్లో మార్పులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

రేషన్ కార్డుల్లో మార్పులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీ విషయంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఆహార భద్రత కార్డుల రూపం మార్చనున్నారు. వీటి స్థానంలో కొత్త కార్డులు జారీ చేసేందుకుంద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు.. ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న 5 లక్షల రూపాయల చికిత్స పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచింది. కాబట్టి ఆరోగ్యశ్రీ పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 

 

Read More ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల 98 వేల 546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఓ చిన్న పుస్తకంలా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వీటిస్థానంలో రైతుబంధు పాస్‌బుక్‌ సైజ్‌లో రేషన్‌కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు.. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. 

 

Read More ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఆ తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో ల్లేకుండా.. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కొత్తగా విడుదల చేయనున్న రేషన్ కార్డులు ఎలా ఉండాలనే విషయంపై తర్వాతలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. కాబట్టి ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభుత్వం దీనిపై చర్చించి కీలక ప్రకటన చేయనుంది.

Tags: