బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు
On
విశ్వంభర, వరంగల్: అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కాసు శిల్ప ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం ధర్మారం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్, కార్పొరేటర్ గంద కల్పన డాక్టర్ గైనకాలజిస్ట్ కూరపాటి రాధిక, అవయవదానానికి స్ఫూర్తిగా నిలబడినటువంటి మల్లారెడ్డి, భారతీయ జనతా పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకురాలు తక్కలపల్లి శ్రీదేవి, మంజులా రెడ్డి, కృష్ణవేణి, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బండారి కళ్యాణి, భారతీయ జనతా పార్టీ మహిళ కార్యకర్తలు, మహిళా మణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



