ఎన్టీఆర్ నగర్ లో ఘనంగా బోనాలు 

ఎన్టీఆర్ నగర్ లో ఘనంగా బోనాలు 

విశ్వంభర, ఎల్బీనగర్ : మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోని కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప స్వామి, అక్క మహాంకాళి బోనాలు పండుగ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే పురం డివిజన్ కురుమ సంఘం ఛైర్మెన్ నరసింహ, సెక్రటరీ కోరే ఐలయ్య, చంద్రయ్య,  ఐలయ్య, అగ్గే వెంకటేష్,  మహేష్, భూమండ్ల మహేష్,  శ్రవణ్ , తోటకూర లింగ స్వామి, బర్మా శ్రీధర్,  శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: