నల్ల పోచమ్మకు, బోనం పట్టు వస్త్రాలు సమర్పణ
On
విశ్వంభర, చంద్రాయన గుట్ట : కందికల్ గెట్ జిఎం చౌవు నిలోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ఉమ్మడి దేవాలయాల వృత్తిదారు ల సంఘం వ్యవస్థాప అధ్యక్షులు పేరోజి మహేశ్వర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ముందుగా వేపకొమ్మలతో కళ్ళు సాక సమర్పించారు. బోనం,ఒ డి బియ్యం,పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నల్ల పోచమ్మ దేవాలయం కు 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని అప్పటినుండి ఇప్పటివరకు గ్రామ దేవతకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఉమ్మడి దేవాలయాలు వృత్తిదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరోజి మహేశ్వర్ తెలిపారు. సంఘము ఉపాధ్యక్షులు పేరోజి ప్రదీప్ కుమార్, సురేందర్ కుమార్, వీరేందర్ కుమార్, సరితా, లక్ష్మీ, లలితా తదితరులు పాల్గొన్నారు.



