TPCC అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
On
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించబడ్డారు. తెలంగాణ 4వ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా కూడా పని చేసారు. Nsui నుంచి పార్టీ ఆర్గనైజేషన్ లో పని చేసుకొని అంచలంచెలుగా టీపీసీసీ అధక్షుడిగా ఎదిగారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఈరోజు ప్రకటించింది. పలువురు కాంగ్రెస్ నాయకులూ , ఎమ్మెల్యే లు , ఎంపీలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ లు శుభాకాంక్షలు తెలిపారు.