ఎలికట్ట గ్రామంలో భక్తిశ్రద్ధలతో బొడ్రాయి పునః ప్రతిష్టాపన
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
On
విశ్వంభర, ఫరూఖ్ నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో బొడ్రాయి పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. సకల దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెంది శ్రీనివాస్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కొందుటి నరేందర్ మాజీ సర్పంచ్ సాయి ప్రసాద్ యాదవ్, యాదయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



