భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు 

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు 

విశ్వంభర, భద్రాచలం :-  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం  తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో కలిసి భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వేద పండితులు మరియు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి నీ దర్శించుకున్న వారు ఆలయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ వారి ఆలయంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే లు చంద్రవంతి, హరిప్రియ నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు , ఉద్యమకారులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 

Tags: