సీఎంని కలిసిన బీసీ కమిషన్ చైర్మన్
On
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ వివిధ అధ్యయనాలలో భాగంగా కోరే సమాచారాన్ని, వివరాలను వెంటనే అందించి, సహకరించేలా ఆయా ప్రభుత్వ విభాగాలకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.శుక్రవారం నాడు రాత్రి అసెంబ్లీ లో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు, పలు పత్రాలు అందజేసినట్లు డాక్టర్ వకుళాభరణం తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ను నిర్ణయించడానికి గాను ,అలాగే ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మేరకు ఆయా ప్రభుత్వ విభాగాలను సమాచారం ఇవ్వాలని బీసీ కమిషన్ ఎప్పటికప్పుడు లేఖలను రాయడం జరుగుతుంది. త్వరగా కమిషన్ కు వివరాలు అందినట్లైతే నివేదికలను సకాలంలో అందజేయడానికి వీలుంటుందని వకుళాభరణం తెలియజేసారు.