మంత్రి తుమ్మల చేతుల మీదుగా  గాజుల అనిల్ నేత కు బాపూజీ పురస్కారం 

మంత్రి తుమ్మల చేతుల మీదుగా  గాజుల అనిల్ నేత కు బాపూజీ పురస్కారం 

ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ : చేనేత చీరలను తయారు చేయడంతో పాటు నూతన ఇక్కత్ డిజైన్ లతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన గాజుల అనిల్ నేత కు రాష్ట్ర స్థాయిలో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతిభ పురస్కారం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా  చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చేనేత విభాగాలకు చెందిన చేనేత కార్మికులకు అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్బంగా గాజుల అనిల్ నేత  మాట్లాడుతూ తానూ చిన్ననాటి నుండి చేనేత పని చేసుకుంటూ చదువుకున్నాని , చేనేత వృత్తి ద్వారా  సమస్యలు ఎన్ని ఉన్న కూడ నిరుత్సాహ పడలేదని , ఉన్నత చదువులతో  తనకి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ  చేనేత వృత్తి మీద ఉన్న ప్రేమ తో దాదాపు 20 సంవత్సరాలుగా  చేనేత రంగంలో ఎన్నో కళాత్మక ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాని అన్నారు. అలాగే అంతరించిపోతున్న ఈ చేనేత కళను కొంతమందికి నేర్పిస్తూ , చేనేత మగ్గాల ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ వస్తున్నాని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతిభ పురస్కారం అందజేయడం చాల సంతోషముగా ఉందని అన్నారు. ఈ అవార్డు అందుకోవడంలో నా సతీమణి పద్మ  చేనేత వృత్తిలో భాగంగా నిత్యం నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం పట్ల కుటుంభం సభ్యులు , గ్రామస్థులు , మిత్రులు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Tags: