సంకల్పానికి సహకారం అయాన్ శిక్షణ సంస్థ - చైర్మన్ అయాన్ గ్రూప్ ఫైవ్ జాబ్స్ అచీవర్ పిసి & స్టేట్ టాపర్, ఆక్టోపస్ మాజీ కమాండో ఎండి. అన్వర్
విశ్వంభర , హనుమకొండ : జిల్లా ప్రతినిధి.:- ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతున్న తరుణంలో తమ విద్యా ఆర్హతలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేని పరిస్థితుల్లో నిరుద్యోగ యువత సందిగ్ధంలో కొట్టిమిట్టాడుతున్నారని చైర్మన్ అయాన్ గ్రూప్ ఫైవ్ జాబ్స్ అచీవర్ పిసి & స్టేట్ టాపర్, ఆక్టోపస్ మాజీ కమాండో ఎండి. అన్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండలోని కిసాన్ పురాలో నూతన అయాన్ గ్రూప్ చైర్మన్ ఎండి. అన్వర్ తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2004లో తాను కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ 2009లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా రాణిస్తూ 2013లో అక్టోపస్ కమాండర్ గా విధులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదే తరుణంలో తనకున్న దాంట్లో ఇతరులకు కొంత సహాయం చేయడం అలవాటుగా మారిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినట్లు తెలిపారు. ఎంతోమంది నిరుద్యోగ యువత సరైన ప్రణాళిక లేక ఎంతో సమయాన్ని వెచ్చించినా తాము అనుకున్నది సాధించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. అలాంటి పక్షంలోనే తాను పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి అయాన్ కోచింగ్ సంస్థను నెలకొల్పినట్లు తెలిపారు. సామాజిక సేవ చేయాలని గొప్ప సంకల్పంతో తన సంస్థ ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించే వారి ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత విద్యావంతులచే బోధన ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి తీర్చిదిద్దుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా నిరుద్యోగ యువతీ యువకులు ఆసక్తి కనబడుస్తున్నారని వారికి అనుగుణంగా శిక్షణ పొందేందుకు ఆయాన్ అకాడమీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.