చండూర్ పదో వార్డులో దారుణ పరిస్థితులు
మున్సిపల్ కమిషనర్ దృష్టికి వార్డు సమస్యలు
On
ప్రజా విశ్వంభర, చండూర్ : స్థానిక చండూరు మున్సిపాలిటీలో పదో వార్డులోని ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గడిచిన నాలుగు నెలల నుండి మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే 25 రోజుల నుండి వీధి దీపాలు వెలగడం లేదు. వార్డులో కూలిపోయిన ఇల్లు ఉండటం వల్ల కట్లపాములు సంచారం చేస్తున్నందున ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పది రోజుల నుండి వార్డులో ఒక కుక్క 15 మందిని దాదాపు కరవడం జరిగింది. వీటిపై చర్య తీసుకోవాలని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమీషనర్ కు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో శిరంశెట్టి శ్రీధర్ బాబు, హరీష్ ,శ్రవణ్, బ్రహ్మచారి, బిక్షమయ్య, శేఖర్, శ్రీను, సతీష్, మల్లయ్య, నాగరాజు, సోమబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు



