విన్ మోటార్స్ టివిఎస్ ములుగు రోడ్డు సౌజన్యంతో ఏఓజి కల్ట్ రైడ్ విజయవంతం. -జీఎం నితిన్ అగర్వాల్
On
విశ్వంభర, హనుమకొండ: విన్ మోటార్స్ టివిఎస్ ములుగు రోడ్డు వారి సౌజన్యంతో మెర్కై ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏఓజి కల్ట్ బైక్ రైడ్ ను ఆదివారం నిర్వహించగా అది విజయవంతయిందని బ్రాంచ్ జీఎం నితిన్ అగర్వాల్ తెలిపారు. టూరిజం,సామాజిక చైతన్యం,యువతలో ఎనర్జీ పెంపొందించేందుకు మెర్కై ఆధ్వర్యంలో వరంగల్‌లో ప్రత్యేకమైన బైక్ రైడ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించబడిందన్నారు.ఈ రైడ్‌లో స్థానిక యువతతోపాటు,బైక్ ప్రేమికులు,సోషల్ యాక్టివిస్టులు,పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజానికి సానుకూల సందేశం ఇచ్చేలా ఈ రైడ్ ను ‘సేఫ్ రైడింగ్ - గ్రీన్ ఫ్యూచర్’ అనే థీమ్‌తో నిర్వహించడం విశేషమని తెలిపారు.ఈ బైక్ ర్యాలీలో 20 మంది రైడర్స్ పాల్గొన్నారు. వచ్చే ఆగస్టు15 తేదీన మళ్ళీ మెగా బైక్ ర్యాలీ ఉంటుందని విన్ మోటార్స్ టివిఎస్ కంపెనీ ములుగు రోడ్డు జనరల్ మేనేజర్ నితిన్ అగర్వాల్ తెలిపారు.



